Book Description
వ్యక్తి అంతరాంతరాల్లో జరిగే సంఘర్షణలను కథల్లోకి మలచి అందించగలిగారు శ్రీ గోపీచంద్. సమాజం అంగీకరించని భావాలను, సంఘటనలను తీసుకొని చలంగారు అద్భుతమైన చిన్న కథలు ఎన్నో రాశారు. ....రమాదేవిగారు తన కథలను ఈ రెండు దృక్పథాలతోనూ రాశారు. తన కథలకు కావలసిన విషయాలను ఎన్నుకోవడంలో ఈమెగారు అవలంబించిన విధానం వినూత్నమైనది. అత్యంత సహజమైన విషయాలను ఎన్నుకోవడమే కాకుండా, వాటిని కథకరించడంలో కూడా వీరి పద్ధతి చాలా కొత్త.