Book Description
1954 నుంచి ఏడేళ్ళపాటు ఈమె హైద్రాబాదు రేడియో కేంద్రంలో ఉన్నారు. అనౌన్సరుగా ఈ కేంద్రం నుంచి ఈమెదే మొదటి స్త్రీ స్వరం. తనకు తగ్గ ఉద్యోగం కాకపోయినా తన విధులతో సంబంధం లేకపోయినా, అటు రేడియో నాటకాల్లో ఇటు కార్మికుల కార్యక్రమంలో అన్నింటా తానై సొంత యింటి పనిగా రేడియో జీవితం గడిపింది. ‘‘ఓడ మనిషి’’, ‘‘లేడీస్ కంపార్టుమెంటు’’ అన్న వీరి రేడియో నాటకాలు మొదటిసారిగా బాంబుల్లా శ్రోతల మధ్య పేలి - రేడియోకే ప్రచారం తెచ్చిపెట్టాయి. రేడియో నటిగా వాయుతరంగాల్లో ఆమె కంఠం పోయిన హొయళ్లు, దాని వెనక వున్న రాగ హృదయపుకలకూజితాలు శ్రోతలు ఎన్నటికీ మరువలేనివి.