Book Description
అన్నయ్యకి, నీ ఉత్తరం నిన్ననే అందింది...అయినా తాను చెడిపోయినా తన పిల్లలు కూడా అలా అయిపోవాలని ఏ తల్లీ కాంక్షించదు... అమ్మ విషయంలో నీకింత విముఖత్వం కలగడానికి కారణం నువ్వు చెప్పకపోయినా నేను గ్రహించుకోగలిగాను.... మన నాన్నగారికి ముసలితనంలో ఇచ్చి చేశారు తనని. పెళ్ళయిన కొద్ది సంవత్సరాలకే నాన్నగారుపోయారు... అమ్మ ప్రవర్తన, అమ్మ కష్టాల్ని చూస్తున్నకొద్దీ అమ్మ మీద జాలే ఎక్కువవుతూ వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో అమ్మకి ఆయనతో స్నేహం కలిసిందో! ఆ స్నేహమే బహుశా అమ్మకి కష్టనష్టాలన్నిటినీ ఎదుర్కొనే బలాన్నిస్తోందేమో! ఇట్లు నీ చెల్లి సంఘంచే నిరాదరణకు గురికాబడ్డ వితంతువులు ఆఖరికి కన్నబిడ్డలే తమను అపార్థం చేసుకుంటే... కలిగే మానసిక వేదనను, తద్వారా ఆవిష్కరించబడిన వినూత్న దృక్కోణాన్ని పాఠకులకు అందించే సంఘర్షణాభరిత నవల ‘తల్లీబిడ్డలు’.