Book Description
‘ఏది ముందు’ అంటే, ‘‘పంది ముందు’’ అంటారు ‘పపువా న్యూగినీ’ వాసులు. ఇది ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ ‘ఆ’ అంటే వరద, ‘ఊ’ అంటే వరద వస్తుంది. వారి నియమావళి ప్రకారం ముందు వారి సంపదయిన పందుల్ని ముందు వరదనీటిని దాటించాలి. ఆ తర్వాత మగపిల్లల్ని, పురుషుల్లో పెద్దల్ని, ఆ తర్వాత వీలయితే ఆడవాళ్లనీ - ఈ వరసన వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలి. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఓ నారీ నీ స్థానం ఆఖర్నేనా!’ మనదేశం అనుకున్నంత వేగంగా అభివృద్ధి పొందలేక పోవడానికి కారణాలేంటి అన్న చర్చ జరిగింది కొంతకాలం క్రితం. ‘జనసంఖ్యలో సగంమంది వున్న స్త్రీల శక్తి సామర్థ్యాలను అన్ని రంగాలలోను వినియోగించుకోకపోవడమే దానికి కారణం’ అన్నారు అప్పటి ఉపరాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్‍గారు. స్త్రీ సంఖ్యాబలం ఎక్కువయ్యాకనే పంచాయితీలలో మందకొడితనం తగ్గిందంటున్నారు అనేక సర్వేలలో.