Book Description
ఉన్నట్లుండి సర్వజగత్తుమీదా, సమస్త జీవ రాశుల మీదా, ప్రతి విషయం మీదా విరక్తి పుట్టుకు వచ్చిందతనికి.ఇంకా యవ్వనం ప్రథమ ధశలోనే వున్న ఆ జీవికి ఒక్కసారిగా వైరాగ్యం మీద ఆసక్తి జనించింది. ఎందుకు చిత్రాలు గీయటం? ఎందుకు చదువులు చదివి తలకాయలు పాడు చేసుకోవటం? ఎందుకు పాటలు పాడి కంఠశోష? ఎందుకు ఈ స్నేహాలు… ఎందుకు ఈ…?ఏమీ చీకూ చింతా వుండనవసరం లేని వాడికి కూడా ఏదో తెలియని విరక్తి,వర్ణించలేని దుఃఖమిశ్రితమైన జుగుప్స దేనికి అతని వేదన?దూరంగా వెన్నాడుతూ ఉంటాయి.కొమ్మూరి వేణుగోపాలరావు మార్కు నవల-\n\n\n\n\n\n