Book Description
“నిన్ను విడిచి నేను బ్రతకలేను నన్ను అల్లుడిగా చేసుకోవటానికి మీ ఇంట్లో ఒప్పుకోరు. ఎందుకు భ్రమ పడతావ్ శారదా!” మరెవర్నో పెళ్ళాడి నువ్వూ సుఖించలేవు. మనిద్దరం కలిసి ఎక్కడికయినా వెళ్ళిపోదాం రా!”మనసా వాచా తనని ప్రేమించినవాణ్ణి కాదని జీవితాన్ని నరకప్రాయం చేసుకున్న శారద.నరకప్రాయం చేసుకున్న శారద.“కేవలం దాంపత్య జీవితం మీద నాకు మోజు.అందుకే అతనికి లోబడ్డాను.”వివాహిత అయినా,పరాయి పురుషుడి కోసం తహతహలాడి జీవితాన్ని ముళ్ళబాటల మధ్య గడిపిన రాగిణి.“నాకు మాత్రం దూరం కాబోకు”తనకుతానే అర్థంకాని, వ్యక్తిని ప్రేమించీ, ఎప్పటికప్పుడు మనసు విప్పి చెప్పకోవాలని వున్నా ఎప్పటికీ అతన్ని తనవాడిగా చేసుకోలేకపోయిన శశి.ఈ విభిన్న మనస్తత్వాల మధ్య ఊగిసలాడిన కథానాయకుడు రవి కథేశారద నవల