Book Description
ఇతరుల చేత అసహ్యించుకోబడుతూ బ్రతకటం, అంతేగాక అనుక్షణం తనని తాను అసహ్యించుకుంటూ బ్రతకటం, పైగా సత్యాలు తెలుసుకోగలగటం మనిషి ప్రత్యేకతలైతే అతని జీవితం ఎలా వుంటుంది? వ్యక్తిత్వం లేకపోవటమే చివరికి ఓ వ్యక్తిత్వంగా పరిణమించిందా? అర్థంలేని మంచితనం మనిషికి వుండకూడదా? అనేక లోపాలున్న అనేకమంది ఎంతో సుఖంగా బ్రతుకుతుంటే అతనెందుకు బ్రతకలేకపోయాడు? ఇంత వాస్తవికతలో అంత విచిత్రం దాగి వుందా? కొమ్మూరి వేణుగోపాలరావుగారి బంగారు పాళీ నుండి వెలువడిన మరో మహత్తర నవల. తెలుగు నవలా సాహిత్య చరిత్రలో అపూర్వ సృష్టి. నూతన ప్రక్రియలకోసం తహతహలాడే పాఠకులకు పన్నీటిజల్లు. మా సంస్థ నుండి సగర్వంగా సమర్పించే నవల ‘వ్యక్తిత్వం లేని మనిషి’.