Book Description
‘ఏమవుతారు వీళ్ళు నాకు? వీళ్ళకు జబ్బులు చేస్తే తనెందుకు బాధపడాలి? వాళ్ళకి నయమయితే తనెందుకంత సంతోషపడాలి? వనజకి చెయ్యీ, కాలూ సరి అయితే తనెంత సంబరపడింది! ఈనాడు రవికాంత్‍కి లివర్ పాడయితే తన మనసెందుకు వికలమవ్వాలి! ఇది కేవలం మానవతా ధర్మమేనా? లేక స్నేహధర్మమా? ఏ ధర్మం అయినా తనకు బాధగానే వుంది అతనికలా ఆరోగ్యం చెడడంవల్ల. నవ్వుతూ, నవ్విస్తూ, హడావిడిగా తిరిగే అతనికి ఇలా ఎందుకవ్వాలి?’ అనుకుంటూ కళ్ళు మూసుకు కూర్చొంది రాజీ. జీవితపు బహుముఖత్వాన్ని రాజీ అంతర్నేత్రం నుండి ఆవిష్కరించిన నవల ‘అనంతం.’