Book Description
మనసు కథలు రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు వివిధ సాహిత్య ప్రక్రియలందు చేయి తిరిగిన ప్రముఖ రచయిత్రిగా పాఠకలోకానికి సుపరిచితులు. అర్ధశతాబ్దం పైగా కథా నవలా రచనలో వారికి అనేక పురస్కరాలు, సన్మాన సత్కారాలతోపాటు విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. అరుదైన సాహితీ కృషీవలులుగా శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి రాజ్యలక్ష్మి దంపతులు బంగారు పంటలనే పండించారు. జంటగా కనిపిస్తూ, ఎవరి పంథాలో వారు చక్కని రచనలుచేసి ఎవరికి వారు ఒక స్థాయిని పొందటం వలన, రాజ్యలక్ష్మిగారు భర్త ఎడబాటు తరువాత కూడా తమ రచనా వ్యాసంగాన్ని మరింతగా కొనసాగించి కొత్త పుంతలు తొక్కించారు. ప్రతికథలో ఒక మెరుపు సహజమైన సంభాషణలు ఇష్టంగా కష్టపడి పనిచేయటం నలుగురితో భావాలను భాగ్యాన్ని పంచుకోవటం పదలు అవసరాలలో ఇతరులను ఆదుకోవటం ఆత్మవిశ్వాసంతో జీవించటం ఇలా ఒక్కో కథ ఒకలా సందేశాన్నిచ్చే మెరుపుతీగ. హింసకు తావులేకుండా అనుసరణీయమైన జీవన సూత్రాలపేటిక ఈ సంపుటి.