Book Description
భాస్కర్ ఇచ్చిన పేకెట్ తీసుకుని తన గదిలోకి వెళ్లింది విద్య. పేకెట్ పూర్తిగా విప్పి ఆ వ్రాతప్రతిని బయటకు తీసింది. అంత పెద్ద సైజువున్న కాగితాల కట్టను పడుకుని చదవడం కష్టం కాబట్టి దిండ్లు ఎత్తుకుని పెట్టుకుని టేబుల్ లాంప్ ఎడ్జస్ట్ చేసుకుని దిళ్ళకి ఆనుకుని కూర్చుంది. చదవటం ప్రారంభించింది. భాస్కర్ తనకి అందించిన నవల చదవడం ముగించిన విద్య చేతుల్లో మొహం దాచుకుని కూర్చుంది. చదివినది నిజంగా కథ అయితే ఎంత బాగుండేది. ఒక పాఠకురాలిగా తనకు నచ్చిన ముగింపు నిస్సంకోచంగా చెప్పేసి వుండేది. ఇదికథ కాదు. జీవితాలకు సంబంధించిన సమస్య. పరిష్కరించే ముందు మనసు రాయి చేసుకోవలసిన అగత్యం ఎంతైనా వుంది. రచయిత ఎంత క్రూరుడు? ఎంత నిర్దయుడు? సంధ్య పాత్రకు ఎంతమాత్రం న్యాయం చేకూర్చలేదు. రవి సంధ్యను కేవలం డాక్టరుగారి అమ్మాయిగా గౌరవించాడు. స్నేహితురాలిగా, కొలీగ్‍గా భావించాడు. తన మనసులోని మాట ధైర్యంగా చెప్పగల చనువును ఏర్పరచుకున్నాడు. కానీ ముఖ్యమైన విషయాన్ని గాలికి వదిలేశాడు. సంధ్య మనసులో ఏముందో తెలుసుకోవాలని ఏనాడూ ప్రయత్నించలేదు. అసలు సంధ్యకి కూడా మనసనేది వుంటుందనే నిజాన్ని పూర్తిగా విస్మరించాడు. ఎంత అన్యాయం!! ఆవేశపడింది విద్య. ఆవేశానికి అర్థం, పరమార్థం తెలియాలంటే ఈ నవల చదవండి