Book Description
‘‘కానుగకాయల్నించి నూనె తీస్తాను నాన్నా, అంటే ‘తలతిక్క వెధవా! నిన్ను పిచ్చికుక్క కరిచిందా’ అని తిట్టిపోశారు. ప్రస్తుతం బ్రహ్మజెముడు పొదల్నించి ఆయిలొస్తుందని నా నమ్మకం’’ అన్నాడు రవి. స్కూలు చదువు పూర్తిచేసిన సరోజ డిగ్రీలో కంప్యూటర్స్ తీసుకుంది. ఒక ఏడాది పూర్తవగానే విసుగేసి ‘ఛ, వెధవ కంప్యూటరు’ అనుకొని కామర్స్ తీసుకుంది. కొన్నిరోజులకి అదీ విసుగేసి బి.ఏ.లో చేరతాననే సరికి కాలేజీవాళ్ళకి చిరాకొచ్చి ‘‘ఇలా అయితే ఆఖర్న ఏ డిగ్రీ ఇస్తాం? మావల్ల కాదు’’ అని ఖచ్చితంగా చెప్పేశారు. రవిని చూసి నిట్టూర్చాడు చంద్రం. ‘అదృష్టవంతుడు... తను అనుకున్న పని చెయ్యగలడు. స్వేచ్ఛగా జీవించగలడు’ అనుకున్నాడు. మెరికలాంటి పిల్ల దుర్గ. ఎమ్‍సీఏ డిస్టింక్షన్‍లో పాసయింది. ఉద్యోగం జోలికి పోకుండా మరో ఇద్దరు క్లాస్‍మేట్స్తో కలిసి స్వంతంగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ప్రారంభించింది పక్క వూళ్ళో. స్వంతంగా ఏదో సాధించాలని ఆరాటపడే రవి, మొదలుపెట్టిన ఏ పనీ పూర్తిచేసే ఓర్పులేని సరోజ, ఎంచక్కా అందరిలా స్వేచ్ఛగా జీవించాలనుకొనే చంద్రం, స్వంతంగా తన కాళ్ళమీద తను నిలబడాలనుకొనే దుర్గ... ఈ నలుగురి మధ్య సాగే సరదాల సరదాగాల నవ్వుల హరివిల్లు పొత్తూరి విజయలక్ష్మిగారి ‘శ్రీరస్తు శుభమస్తు’ తప్పక చదవండి.