Book Description
పోలీస్ ఇన్‍స్పెక్టర్ రమేష్ చాలా సరదా అయిన మనిషి, చొరవ, ధైర్యం, మంచితనం అన్నీ కలబోసిన మనస్తత్వం. అతని భార్య శ్యామల. విచిత్రమైన మనిషి. ఆవిడకి ఒక నిర్ణీతమైన అభిప్రాయాలు లేవు. నిలకడలేని మనస్తత్వం. ఎవరిమీదనైనా ఇష్టం కలిగిందంటే వాళ్ళని రాసుకు పూసుకు తిరిగేసి ఇక వాళ్ళే లోకం అన్నట్లు వుంటుంది. ఏదో చిన్న విషయం మీద గొడవపడి వాళ్ళతో దెబ్బలాడి వాళ్ళమొహం చూడదు కొన్నాళ్ళు. ఆ దంపతులకి ఒక కొడుకు. వాడి వయసు పదినెలలు. ఇంకో వ్యక్తి బ్యాంక్ మేనేజర్ రామారావు. నలభై ఏళ్ళు ఉంటాయి. సౌమ్యుడు. భార్య పట్నంలో ఉద్యోగం చేసుకుంటోంది. పిల్లలని పెట్టుకుని అక్కడే వుంటోంది. రామారావు ఒంటరిగా వుంటున్నాడు. డాక్టర్ యమున. ఈ గుంపులో కొత్తమెంబరు డాక్టర్ చక్రపాణి. ఈ వున్న నలుగురూ తరచూ కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఒకే ఇంట్లో భోజనాలు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇక చదవండి.