Book Description
బీ - ఇండియన్ ఒక మంచికథ... బ్రాండెడ్ భూతం ఆవహించిన మనం ఆలోచించడం మానేసి మనమేలు, దేశంమేలు కూడా మర్చిపోతున్నామని మనని ‘‘కుదిపి’’ చెప్పేకథ ఇది... జాతిని నిర్వీర్యం చేసేవాళ్ళు, దేశాన్ని ఆర్థికంగా ఆక్రమించాలన్న ప్రణాళిక ఉన్నవాళ్ళు, అడ్వర్‍టైజ్‍మెంట్స్ను వాడుకుని జనాన్ని హిప్నటైజ్ చేస్తారు. ఎర్రటి అట్టమీద తెల్లది అక్షరాలపేరు పదేపదే చూపిస్తే కొట్టుకువెళ్ళి ఒద్దనుకున్నా అదే కొంటాము. ఆ పద్ధతి ఉపయోగించే మనమీద ‘‘బ్రాండ్’’ను ఆవహింపజేస్తున్నారు వ్యాపారవేత్తలు. ఒకప్పుడు హైద్రాబాద్ బాలానగర్‍లో అమెరికాలో ఒక ప్రముఖవ్యక్తి వేసుకునే బ్రాండెడ్ షర్టస్ కుడుతున్నారని తెలిసింది కుర్రకారుకు... అతను కుట్టిచ్చిన షర్టస్కు బ్రాండ్‍నేమ్ ట్యాగ్‍తో అమ్ముతాడు దళారి. ఇంకేం ఆ టైలర్ కోటీశ్వరుడైపోతాడు. టైలర్ దగ్గర గుడ్డ, టైలరింగ్ బిల్లు కలిసి నాలుగువందలు. కానీ బ్రాండ్ టాగ్ వేస్తే షర్ట్ఖరీదు పద్దెనిమిది వందలు.. కానీ బ్రాండ్ కోసం, ఆ చిన్న ...లేబుల్‍కోసం నాలుగువందల వస్తువు పద్దెనిమిది వందలకు కొంటున్నారట జనం... ఇట్లాంటి విషయాలు సహేతుకంగా చెప్తూ భునవచంద్రగారు ఈ కథలో ఒక ట్రిక్ చేశారు. పొలం నుంచి వచ్చిన తాజా కూరల్ని, సరుకుల్ని, పళ్ళను అమ్మే చిల్లర వ్యాపారస్థులతో సామాన్యమానవుడికి ఉండే సత్సంబంధాలను ఆ తాజా సరుకులతో చేసే వంటకాలను వర్ణిస్తూ తెగనోరు ఊరింపజేసి ‘‘ఛీ! పాడు బ్రాండ్లు.. ఎప్పటి నిలవున్న సరుకులో’’ అనిపించేట్లు చేసేశారు. ఇది నిజంగా దేశసేవే.