Book Description
మాయానగరం అన్నిట్నీ అంతట్నీ గమనిస్తూనే వుంది. అవిశ్రాంతంగా.. ఆత్రంగా ప్రతివ్యక్తి జీవితంలోంచీ మరో వ్యక్తి నేర్చుకోదగింది కొంతే వుంటుంది. ఎందుకంటే మనిషి జీవితంలో అత్యద్భుత క్షణాలు కొన్ని మాత్రమే వుంటాయి. అలాగే మనిషి జీవితం పుట్టుకనుంచి మృత్యువు వరకూ స్థిరమైనది కాదు. ఎప్పటికప్పుడు పరిస్థితులకి అనుగుణంగా మారిపోతూనే వుంటుంది. తనని తాను మార్చుకుంటూనే వుంటుంది. నగరం కూడా మనిషిలాంటిదే. ఏ నగరపు ప్రవృత్తి దానిదే. మనిషి అనేకానేక భావాల్ని తనలో ఇముడ్చుకున్నట్టు నగరం కూడా రకరకాల మనుషుల్ని తనలో ఇముడ్చుకుంటుంది. అవిశ్రాంతంగా తనమీద ఆధారపడ్డవాళ్ళ బ్రతుకుల్ని గమనిస్తూనే వుంటుంది. మౌనంగా... నిర్వికారంగా. అందుకే - ‘మాయానగరం’ కథ ఎప్పటికీ సశేషమే.