Book Description
‘‘గులాబి మొక్కకు ముళ్ళున్నాయని ఆగ్రహించకు. ముళ్ళ పొదకు గులాబీలు పూశాయని ఆనందించు. అలాగే లోకంలో అందరూ కలుపుమొక్కల్లాంటి చీడపురుగులు వుంటారని ఊహించకు. లోకంలో అణువణువు ప్రేమతత్వం మూర్తీభవించిన మహానుభావులు, విశాల హృదయులు సైతం వున్నారని విశ్వసించు అన్నారు నెహ్రుగారు. ఈ వాక్యంలో ఎంత మంచి అర్థం వుందో తెలుసుకోండి. ఏమిటి ఇలాంటి జీవితం అని విరక్తి చెందేకన్నా మనం జీవించే జీవితంలో మంచిని వెతుక్కుంటే మనస్సుకి శాంతి లభిస్తుంది’’ ప్రశాంతంగా చెప్పాడు డాక్టర్ విశాల్. ‘‘జీవితమంటే విరక్తి కలిగినప్పుడు శాంతి ఎక్కడినుండి లభిస్తుంది డాక్టర్?’’ ఉద్విగ్నంగా అంది డాక్టర్ విరిజ.