Book Description
‘‘ఈ తరానికి ప్రపంచ విజేత మీరే...! ఈ ప్రపంచం అంతా మీ ఆధీనంలోకి వచ్చే వరకూ విశ్రమించను...’’ అని ప్రతిజ్ఞ చేసింది అప్సర. ‘‘మహానగరా! ఈ ప్రజలకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించి, పాడిపంటలు వర్ధిల్ల చేసిన నీ కృషికి గుర్తింపుగా జలనిధి అయిన సముద్రానికి ‘సాగరం’ అని నామకరణం చేస్తున్నాను.’’ అంటూ ఆశీర్వదించాడు వశిష్ఠుడు. ‘‘పొలాలు దున్నుతూ పౌరుషహీనులై బతుకుతున్నారు కాబట్టే నాగరికుల్ని అనాగరికులు ఆట పట్టిస్తున్నారు. కత్తిపట్టి కదన రంగాన నిల్చుని తలలు తెగనరికే శౌర్యంగల జాతివంక కన్నెత్తి చూడగలరా ఎవరైనా?...’’ హుంకరించాడు అసమంజసుడు. ‘‘అసమంజసుడివంటి అసహనపరుడికీ, కర్కోటకుడికీ ఈ సింహాసనాన్ని అధిష్టించే యోగ్యత లేదు. వాడివారసత్వాన్ని బహిష్కరిస్తున్నాను.’’ ఆవేశంగా అన్నాడు మహాసగరుడు. ‘‘అసమంజసుని నా వెంట మిశ్రదేశానికి (ఈజిప్ట్) తీసుకు వెళ్ళడమే ఈ సమస్యకు పరిష్కారం’’ అన్నది రోదిస్తూ యోజిత. ఈజిప్ట్ మహానాగరికతను సుస్థాపించిన ‘మెనిన్’ మన రామాయణ, భారతాలలో కన్పించే అసంమజసుడే... అనే చారిత్రక పరిశోధన చుట్టూ అల్లిన నవలా మాలిక.... ‘సప్తసింధు’.