Book Description
బాల్యంలో పిల్లల ఆకతాయితనం గురించిన విషయాల్ని చదువుతున్నపుడు ఎంతో నవ్వుకున్న నేను, ఆటుపోట్ల నడుమ ‘‘ ‘పదవ తరగతి’ పరీక్షల అనంతరం అమ్మమ్మగారి వూరు వెళ్ళాకనే కడుపునిండా భోజనం చేసాను’’ అని రచయిత చెబుతుంటే, అప్రయత్నంగానే నా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. యువకుల్లో వుండే ఆదర్శ భావాలకు తోడుగా వుండే దూకుడుయెంత సహజమైనదో చెపుతుంటే అభినందించకుండా ఉండలేని నేను, తల్లిని, భార్యని గౌరవిస్తూ, తండ్రిని అక్కునచేర్చుకున్న తీరుకు ఆరాధించడం మొదలు పెట్టాను. ఇలా, ప్రతీ సన్నివేశాన్ని ఆర్ద్రత చెడకుండా అనువదించాలన్న సంకల్పమే ఈ పుస్తకాన్ని నేను ఇన్ని నెలలు మోసేలా చేసింది. అందుకే ఈ “కథా కన్య” నాకు ఎంతో అపురూపం.