Book Description
వేదాంతం శ్రీపతి శర్మగారు తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషలలోనూ పలు రచనలు చేశారు. ఆంధప్రభ, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య, చిత్ర పత్రికలలో శ్రీపతిగారి కథలు, నవలలు అనేకం ప్రచురితమైనవి. ‘చిత్ర’ అనే తెలుగు మాస పత్రికలో ఆర్థిక, రాజకీయపరమైన వ్యాసాలు అనేకం అందించారు. ‘‘కబుర్లు’’ శీర్షిక పేరిట ఆంధప్రభలో వ్యంగ్య రచనలు చేశారు. పత్రికలలో రచయిత, కాలమిస్ట్గానే కాక హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో చిన్న చిన్న ఇంగ్లీషు కథలు, అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల సందర్భంగా రివ్యూలు కూడా రచించారు. ప్రస్తుత కాలంలో టీ.వీలు, కంప్యూటర్లు, త్రీడీ యానిమేషన్‍లకు ఆకర్షితులమై కబుర్లను మరచిపోతున్నాం. మనలోని ఆలోచనలను సహజంగా, కులాసాగా, కథలుగా, చమత్కారంగా ఒకరికొకరం పంచుకోవటం ఎంత ఆనందదాయకం! ఇలా తనలో రగిలే ఆలోచనలను నిర్ద్వంద్వంగా తెల్ల కాగితం మీద పెట్టగలిగేవాడే రచయిత. అలా సాలోచనాపరమైన కథలకు సున్నితమైన హాస్యం జోడింపబడి శ్రీపతి శర్మగారి కలం నుంచి జాలువారిన కథల సంపుటే ‘శ్రీరాగం’.