Book Description
అయనము అంటే నడక. కాలము ఉత్తరాయణము, దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది. రెండు పాదములు అనగా రెండుకాళ్ళు లేవనుకోండి – అపుడు మనం నడిచే నడక కుంటినడక. సక్రమంగా నడవలేము. అలాగే రామచంద్రమూర్తి రెండుకాళ్ళు బాహ్యంలో ఉండే కాళ్ళుకావు. ఆయన సత్యాన్ని, ధర్మాన్ని రెండిటినీ రెండు పాదములుగా పెట్టుకొని నడిచాడు. అందుకని ఏదిపోనివ్వండి ఆయన లక్ష్యపెట్టలేదు. ఎంతటి కష్టం రానివ్వండి ఆయన బెంగపెట్టుకోలేదు. సత్యము, ధర్మము- ఈ రెండిటిని మాత్రము ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకొన్నవానిని ఆ రెండూ ఎలా కాపాడతాయో రామాయణం మనకు చూపిస్తుంది.