Book Description
శాస్త్ర మంటే? జీవితంలో మనకున్న అనుభవంలో ఏ విషయాన్ని గూర్చి అయినా మరింత శ్రద్ధగా, లోతుగా, నిశితంగా పరిశీలిస్తే, మనంతట మనకే ఆ విషయతత్త్వం స్పష్టంగా అర్థమౌతూ వుంటుంది. ఉదాహరణకు, ఇళ్ళల్లో చీమలను చూడనివారు ఎవరు? అయినా మనకు చీమల గురించి ఎంత మాత్రం తెలుసు? ఏ కారణంవల్లో, చీమల గురించి తెలుసుకోవాలనే శ్రద్ధ కలిగితే, మనమే ఒక భూతద్దం పట్టుకొని, చీమల జీవితాన్ని పరిశీలించటం ప్రారంభిస్తే, చీమల రాజ్యం గురించి మనకే అద్భుతరహస్యాలు తెలుస్తాయి.