Book Description
ఇక మన కంచి పరమాచార్యులు బాణి యేమిటి? తల్లి అరటి పండును ఒలిచి పిల్ల నోట్లోపెట్టినట్లుంటుంది. మ్రింగడం కష్టమైతే దగ్గరుండి కంఠాన్ని నిమురు నట్లుంటుంది. ఆయాకాలాలలో మహాత్ములవతరించి మార్గనిర్దేశనం చేస్తారు. తల్లితో ఎందుకుపోల్చినట్లు? ఎందుకా? భార్యలున్నారు - సహధర్మచారిణులు లేరు ''మేస్టర్లు''న్నారు - గురువులు లేరు కొడుకులున్నారు - పుత్రులు లేరు పరిచయంకలవారున్నారు - మిత్రులు లేరు శుభాలకేవచ్చేవారుకాని తల్లిదండ్రులున్నారు, ఉంటారు. అందుకే తల్లితో పోలిక