Book Description
నిరంతరం కార్యమగ్నులమై ఉంటాం. తాత్కాలిక సుఖం లభిస్తూ ఉంటుంది. అయినా తృప్తి యుండదు. ఏమిటి ఇదంతా అనే తాత్కాలిక వైరాగ్యం కల్గుతూ ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యాన్ని రుచి చూస్తాం తాత్కాలికంగా. నీటిమీద వ్రాత మాదిరిగా అవీ కలకాలం మనల్ని పట్టుకొని యుండవు. మరల కర్మలలో మునుగుతూ ఉంటాం. ధ్యానాదులను చేయలేం. కర్మకాండలు చేస్తూ నివృత్తి మార్గంలో పయనించడానికి అందులో రెండు మార్గాలున్నాయి.