Book Description
పూజకి ఒక్క క్షణం ఈ సృష్టి అంతా సర్వానందజంత్ర సమ్మేళనంగా అన్పించింది! సిద్దార్థని మరింత దగ్గరకు తీసుకుంది. శరీరం అంతా ఆనందపు వెలుగుమైకంలా కమ్మేస్తుంది. ఈ ప్రపంచంలో ఇతను తప్ప తనకి యింకేం అవసరంలేదు అన్పిస్తుంది. ఈ ఆనందంలో ఏదో శక్తి! అది ఆమె మనసులోని సంకోచపు గొలుసుల్ని తెగ్గొట్టేసి,ఆమెకి స్వచ్ఛమైన,నిర్మలమైన ఆనందపు అమృతాల్ని దోసిలితో తాగిస్తోంది! ఎక్కడో బీటలు వారిన మనసు క్షేత్రంలో ఆ అమృతపు చినుకులు రాలుతున్నాయి! ఆమెలోని ఏదో నిరుపేదతనం, దాని తాలుకు వ్యథ….! ఎండిన ఆకుల్లా రాలిపోతున్నాయి. ఒక సుమధురమైన గాలి! ఒక కొత్తపథం వైపు పయనం! సిద్దార్థ భుజాల చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకుని, ఆ వెలుగుపుంత వైపు తను నిస్సంకోచంగా నడవటానికి సిద్ధం అవుతుంది. అడుగు ముందుకు పడ్తోంది.తనని ఎవ్వరూ ఆపలేరు! అభిజిత్ కూడా అడ్డుకోలేడు! ఆమెకి అర్థం అయిపోతుంది.తను పుట్టిందీ,బ్రతుకుతోందీ యీ దివ్యక్షణాల కోసమే! ఇతని కోసమే!