Book Description
“విద్యాధర్ తో పెళ్ళి చేసేయ్యాలి.” “పెళ్ళా! అయిపోయిందిగా ఇంకా ఏమిటి?”అంది విసుగ్గా. ”అది ఒక పెళ్ళా! అబద్దపు పుట్ట.నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను.లీగల్ గా మీ ఇద్దరూ భార్యాభర్తలవాలి.” ‘దానికోసం నువ్వు తగిలేసే డబ్బు నాకివ్వు.’ “ఇవ్వను. ఒక్కపైసా కూడా ఇవ్వను. విద్యాతో పెళ్ళి చేసి డబ్బు విషయం మొత్తం విద్యాకి కంట్రోలు ఇచ్చేస్తాను.” “ఏమిటీ!”గుమ్మం దాటబోతున్న సమీర వెనక్కి తిరిగి వచ్చి ఆయన టేబుల్ కెదురుగా నిలబడింది.నడం మీద చేయి ఆనించుకుని ఆయనని తీక్షణంగా చూసింది. “ఇదా! నా పెళ్ళిలో నవ్వు చేయాలనుకున్న పరమార్థం. నన్ను,ఆస్తిని విద్యాకి కట్టబట్టాలని అనుకుంటున్నావా నువ్వు!” అడిగింది.