Book Description
భారతదేశ విముక్తి సంగ్రామంలో పాల్గొని, తర్వాత 1947-49 మధ్యకాలంలో ఆ భూభాగాన్ని ఏకత్రితం చేసిన రైతుబిడ్డ వల్లభ్‌భాయ్ జీవిత చరిత్ర ఇది. ఆ కథనాన్ని ఇంత సమగ్రమైన రీతిలో ఇంతవరకు ఎవరూ రచించలేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, డైరీలు, స్వయంగా సర్దార్ రాసిన లేఖలు, ఆయన కుమార్తె మణిబెన్ అద్భుతమైన డైరీలను సైతం సంప్రదించి రచించిన ఈ జీవితకథనం ఆధికారికమైంది, సన్నిహిత పరిశీలనతో సర్వసమగ్రమైనది. ఇంతకన్నా మెరుగైన రచన బహుశా సాధ్యపడదేమో. గాంధీ మద్దతుతో నెహ్రూ ఎందుకు ప్రధానమంత్రి అయ్యారు? పటేల్ ఎందువల్ల కాలేదు? వల్లభ్‌భాయ్ ముస్లిములకు వ్యతిరేకా? మౌలానా ఆజాద్, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌లతో, మహాత్మునితో తన సంబంధాలు ఏవిధంగా ఉండేవి? ఆయన సోషలిస్టులతో ఎందుకు ఘర్షణ పడ్డారు? సర్దార్ పటేల్ దేశాన్ని ఏవిధంగా ఐక్యం చేసారు? దేశ విభజనకు అంగీకరించింది ఎందుకోసం? అంతకు చాలాకాలం ముందు సిరిసంపదలతో కూడిన సుఖమయ జీవితాన్ని కాదని గాంధీతో కలసి ఉద్యమపథంలో ఎందుకు నడిచారు? కూలంకషమైన పరిశోధన, నిర్మొహమాటమైన కథనరీతి గల ఈ గ్రంథాన్ని చదువుతూ పోయినకొద్దీ వీటితోపాటు ఇంకా అనేకమైన ప్రశ్నలకు మనకు సమాధానాలు లభిస్తాయి.