Book Description
సంక్షిప్తంగా కాకతీయుల పాలన, మహమ్మదీయుల విజయం, వారి తరిమివేత, కొత్త హిందూరాజ్యస్థాపన, అది విభజితమవటం, కొండవీడు, రాజమండ్రి రెడ్డిరాజుల పాలన గురించి చెప్తుంది. సంక్షిప్త విశ్లేషణ అనితల్లి శాసనం తెలింగాణ చరిత్రకు నిజానికి లఘురూప వర్ణన అని తెల్పుతుంది. ఈ ప్రశస్తి రాసిన కవికి చరిత్ర పట్ల ఉన్నభావం ఆశ్చర్యం గొల్పేవిధంగా ఆధునిక మనిపిస్తుంది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ ఉదాహరణను ఇతర ప్రశస్తి రచయితలు పాటించలేదు; ఆ కారణంగా ఆ శాసనానికి పోలిక వచ్చేమరో శాసనం లేదు.