Book Description
గీతపై ప్రధాన అభియోగం అది ఈనాటి కులవ్యవస్థకు, దాని దుష్పరిణామాలకు మూలకారణమని. గీత రెండు సందర్భాలలో (నాలుగో అధ్యాయంలో, చివరి అధ్యాయంలో) వర్ణవ్యవస్థప్రసక్తి తెచ్చింది.ఆ ప్రసక్తి ప్రయోజనమేమిటో వివరించింది ఈవ్యాఖ్య. మొదటి ప్రసక్తి భగవానుని దివ్యజన్మకర్మల తత్త్వం వివరించే సందర్భం. రెండవది వర్ణవ్యవస్థకు మూలమైన గుణకర్మల ప్రాధాన్యాన్ని వివరించే సందర్భం. ఈ నాటి కుల వ్యవస్థను సమర్థించే ప్రసక్తి గీతలో లేదు. కులవ్యవస్థ ఈ నాటిది. దానికి కర్తలం మనం. ఆ నింద భరించవలసినది మనం, గీత కాదు, మరో గ్రంథం కాదు.