Book Description
“విద జ్ఞానే” అనే ధాతువునుండి వేదశబ్దము నిష్పన్నమైనది. “విదంతి ధర్మాదికమితి వేదః” అని వేద శబ్దము వ్యుత్పత్తి. దీనిచే ధర్మాది పురుషార్థాలు తెలియబడతాయి కాబట్టి వేదం అని భావం. “వేద్యతే పరమాత్మా అనే నేతి వేదః” అని కూడా వ్యుత్పత్తి. దీనిచే పరమాత్మ తెలియబడతాడు కాబట్టి వేదం అని తాత్పర్యం. “వేదైశ్చ సర్వై రహ మేవ వేద్యః’’ అని కృష్ణపరమాత్మ భగవద్గీతలో ఈ విషయాన్ని తెలిపినాడు.