Book Description
ఇది రెండు శ్వేత పద్మాల కథ. నిండు వెన్నెలకి విరిసిన ఒక శ్వేత పద్మం చరిత్రలో నిలిచిపోతే, గుడ్డి దీపపు వెలుగుని వెన్నెలని నమ్మి వాడిపోయిన మరో శ్వేత పద్మము చరిత్ర గర్భంలో కలిసిపోయింది. \n \nప్రవీణ్‍గా పిలువబడే రచయిత పూర్తిపేరు ‘వేంకట విశ్వంభర సుబ్రమణ్య సీతారామరాజు’ వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తాలూకా చిత్ఫలపాలం అయినప్పటికీ బాల్యం, విద్యాభ్యాసం అంతా విజయనగరం జిల్లా అలమండ గ్రామంలో మాతామహుల ఇంటసాగింది. M.Sc పట్టభద్రుడైన ఈయన పలు కళాశాలల్లో అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే సాహిత్యం పట్ల మక్కువతో రచనారంగంలోకి అడుగుపెట్టారు.