Book Description
‘‘హల్లో .......... హౌవ్వార్యూ ఇప్పటిదాకా బాగానే ఉండి ఉంటారు. ఎందుకంటే ఇంకా ఈ నవల చదవడం మొదలుపెట్టలేదు కనుక. మేం కష్టపడి నవల్రాస్తే (మూడునెలలో ఆరునెలలో కూర్చుని) ‘‘ఎబ్బే...ఏం బావుందీ’’ అంటూ మీరు చప్పరించేస్తారు. అదే సినిమా అయితేనో.... ‘‘అబ్బో...చాలా బాగుంది’’ ‘‘హమ్మో బాగుంది-’’ ‘‘వారెవ్వా...కథ సూపర్ గా ఉంది. సినిమా హిట్టే కనీసం వందరోజులు గ్యారంటీ’’ అంటారు. ఇవేమీ కాకపోయినా కనీసం ‘‘ఆ సినిమానా? ఫరవాలేదు....చూడొచ్చు’’ అనైనా అంటారు. మీకు ఇంతగా నచ్చిన సినిమాల్లో ఏముంటుందీ? చిన్నప్పటినుండీ మీరు చూస్తున్న సీన్లే ఉంటాయి. సినిమానిండా.... ఇప్పటికీ కొన్ని వందలసార్లు ఆ సీనులు చూసి ఉంటారు. సినిమా చూస్తున్నపుడు ముందువచ్చే సీనులూ, డైలాగులు కూడా మీరు చెప్పేయగలుగుతారు. అయినా మీకు ఆ సినిమాలే నచ్చుతాయ్. యామై రైట్.. రైట్.. అందుకే నేను ఏదో రాసి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీకు అన్ని విధాలా నచ్చే ఆ సినిమా టైపు కథనే మీకు చెప్పి, మీ మనసుల్ని రంజింప చెయ్యలని బంగారందో, ఇత్తడిదో, ఏదో ఒక కంకణం కట్టుకున్నాను. మరి రెడీగా ఉన్నారా? కథ చెప్తాను? ? రెడీ...