Book Description
”నాకు మిమిక్రీ చేతకాదని అంటావా… ఉండు నీ పని పడ్తా” అని మనసులో అనుకుంది. చిట్టికి కాస్త దూరంలో నాలుగు ఊరకుక్కలు కనిపించాయ్. వెంటనే దాని మనసులో ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ”ఒరేయ్ నానీ!… నీకు దమ్ముంటే కుక్కలా అరువ్ చూద్దాం” అంది. ”ఓస్! అదెంత సేపు!” అని నాని మూతికి రెండు చేతులూ అడ్డుపెట్టి ”భౌ…. భౌ…” అంటూ కుక్కలా మొరిగాడు. ఆ అరుపు విని నాలుగు ఊరకుక్కలు ఇటువైపు తిరిగి కుక్కలా అరుస్తున్న నాని వెంట ”భౌ… భౌ…” మంటూ మొరుగుతూ వెంటబడ్డాయ్. నాని ”బాబోయ్….” అంటూ అక్కడినుండి పరుగు తీశాడు. చిట్టి పకపకా నవ్వింది.