Book Description
శ్రీకృష్ణ పరమాత్మ అవతరించింది లోక కళ్యాణం కోసం. కృష్ణతత్త్వాన్ని జీర్ణించుకునన ‘కృష్ణక్క’ రచనలు చేస్తున్నదీ లోక కళ్యాణం కోసమే. శ్రీ కృష్ణతత్త్వామృతాన్ని ఒక్కసారి పానం చెయ్యగలిగితే చాలు. మననం చేసుకోగలిగితే చాలు. సత్యసంకల్పం ఎంతటి మహోత్క•ష్టమైనదో, ఆత్మార్పణ ఎంతటి అవ్యక్తానందాన్ని అందించగలదో, అద్వైత స్థితి ఎంతటి ఆధ్యాత్మిక సిద్ధిని ప్రసాదించగలదో, మధుర భక్తి భావన ఎంతటి చిన్మయానంద స్థితిని సొంతం చేయగలదో గ్రహించగలుగుతారు. మాయను అధిగమించగలుగుతారు. శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ దర్శనభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీకృష్ణ మననం కొంగ్రొత్త దివ్యానుభూతులను సొంతం చేస్తుంది. శ్రీకృష్ణ స్మరణం కృష్ణ తేజాన్ని మనలో ఆవిష్కరింపజేస్తుంది. ఆత్మానుగతమైన అద్వైతానుభూతులను అందరి పరం చెయ్యాలనీ, అందరితో పంచుకోవాలనీ... తద్వారా సమస్త లోకాలకూ మేలు కలగాలన్నదే- కృష్ణక్క ఆశయం, ఆరాటం, ఆకాంక్ష. తదనుగుణ ఆవిర్భావమే, అవతరణమే ‘వందేకృష్ణం’ కృష్ణం వందే జగద్గురుం - శ్రీకృష్ణం శరణం మమ.