Book Description
అది పదునెనిమిది వందల అరువది తొమ్మిదవ సంవత్సరం, అక్టోబరు నెల రెండవతేదీ. గుజరాతు రాష్ట్రములోని కథియవాడ ప్రాంతములోని పోరుబందరు పట్టణము. ఆ కుటుంబంలో మరొక గాంధీ పుట్టాడు. అతడు యావద్భారతావనికే కాక మొత్తం ప్రపంచమంతా గుర్తించే ఏకైక నేత అవుతాడని ఎవరూ కలగనలేదు. భవిష్యత్తులో మొత్తం జాతిని ఒకే త్రాటిమీద నడిపించగల నేత అవుతాడని ఎలా తెలుస్తుంది? మోహన్‍దాస్ అని పేరు పెట్టుకున్నారు. తండ్రిపేరు చివర కలిసి అతడు మోహన్‍దాస్ కరమ్‍చంద్ గాంధీ అయ్యాడు. స్వార్థం కన్నా త్యాగం గొప్పది. కోపం కన్నా శాంతమే మహనీయమైనది. శిక్ష కన్నా క్షమ అమోఘమైనది. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా వాటిలో వున్న అంతఃసూత్రం మానవత. మతానికి అర్థం మమత-మానవత, నైతికత, మహనీయత అని గాంధీ గుర్తించాడు. 1942లో క్విట్ ఇండియా నినాదాన్ని ఇచ్చాడు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మనదేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించాడు. ఆయనే మన ‘జాతిపిత’ మహాత్మాగాంధీ.