Book Description
తెలుగు టెలుగుగా మారటం చూసి ఓ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన ఈ పుస్తకం. నాలుగు మంచి తెలుగు మాటలు, రెండు మంచి తెలుగు పాటలు మన పిల్లలకి నేర్పాల్సిన అవసరాన్ని మీకు తెలియజేస్తుంది. రేపటి తరం పిల్లలు వాళ్ల మూలాల గురించి తెలియక తికమ••కు గురికాకుండా రక్షించాలనే తపన అక్షరం అక్షరంలో కన్పిస్తుంది. ఈ పుస్తకం మనకోసం, మన పిల్లల మన పిల్లలుగానే మిగలాలనుకునే తల్లిదండ్రుల కోసం...