Book Description
ఆయుర్వేదం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్యశాస్త్రం. సృష్టి ప్రారంభం నుండి మానవుడు తన శరీరానికి వస్తున్న అనేకానేక రుగ్మతలకు కారణాలను తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనల ఫలితమే ఆయుర్వేదం. తనకు కలుగుతున్న బాధలను నివారించుకోవడానికి ప్రకృతిలో లభ్యమవుతున్న అనేక వృక్ష, ఖనిజ, రసాయన పదార్ధాలను పరిశీలించి, పరిశోధించి, పరిష్కారాలను ఆవిష్కరించారు. తక్కిన వైద్య విధానాలు శారీరక రుగ్మతల వల్ల ఏర్పడ్డ బాధలను నివారిస్తే ఆయుర్వేదం వ్యాధుల మూలాలను తెలుసుకొని రోగ ఉపశమనం కన్నా రోగనివారణకే ప్రాధాన్యం ఇస్తుందని విజ్ఞుల అభిప్రాయం.