Book Description
ఆంధ్రదేశంలో బహుళ ప్రచారం పొందిన శతకం వేమన శతకం. దీని కర్త వేమన యోగి. నిజానికి వేమన కొన్ని వేల పద్యాలను చెప్పాడు. అందులో నీతి బోధకములైన నూరు పద్యాలను ఒక శతకంగా సంకలనం చేశారు. దీనినే వేమన శతకం అంటున్నారు. ‘‘తెలుగు ప్రజానీకానికి వేమన్న ఒక మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాల నందుకున్న మానవతామూర్తి ఆయన. మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాలను నిత్నాన్వేషణ శీలంతో దర్శించి, విమర్శించిన వివేకి ఆయన. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికి అందించాడా మహానుభావుడు. ‘‘వేమన మహాకవి మాత్రమే కాదు. ప్రజాకవి. తిరుగుబాటు కవి. లోక కవి కూడా. ‘విశ్వదాభిరామ! వినురవేమ!’ అనే మకుటంతో ఉన్న వేమన పద్యాలన్నీ ‘ఆటవెలది’ ఛందస్సులో ఉన్నాయి.