Book Description
ఈ గ్రంధము అందరకు అర్ధమయ్యేభాషలో తేలికగా విషయాన్ని రచించడమైనది. ఈ కాలంలో విద్య, విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా చాలా మందికి పూర్తిగా వారి శరీరాన్ని గురించిగాని, దాని తత్త్వాన్ని గురించిగాని తెలియదని చెప్పడానికి ఏమీ సందేహము లేదు. ఈ గ్రంధములో వేరువేరు ఆసనములు వివిధములైన ప్రకృతి చికిత్సాపద్ధతులు వివరంగా చెప్పబడి వున్నాయి. వాటిని చదివి అర్థం చేసుకున్నవారు ఈ శరీర యంత్రాన్ని జాగ్రత్తగా నడుపు కొనగలుగుతారు. ముఖ్యంగా తెలుగులో ఇటువంటి గ్రంథము మరొకటిలేదు. శరీరానికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉన్నది. ఈ రెండింటిలో ఏ ఒకటి లోపించినా రెండవది శూన్యమవుతుంది. కావున పాఠకులు చదివి లాభం పొందగలరనే మా ఆశ. దేహమును ఆత్మార్ధమై పోషించువారు, వ్యసనాదులకు చిక్కక దేహమును ఆరోగ్యవంతముగా దీర్ఘకాలము నిలుపుకొనగలుగుదురనీ మా ఆశ. ఆయుర్వేదంలో చెప్పబడ్డ ప్రివెంటివ్ మెడిసన్‍ను విద్యార్ధులకు, విద్యార్ధినీలకు లేతమనస్సప్పుడే పాఠశాలల్లో భోదించాలి.