Book Description
ఈ పుస్తకంలోని చీకటిలో చిరుకాంతి, లాయర్ ఇంద్రజిత్ రెండు నవలలూ మనతో సంభాషిస్తాయి. మనతో వాదిస్తాయి. మనం చెబితే వింటాయి.
వెలుగు తెల్లగా ఉండాలి. వెన్నెల చల్లగా ఉండాలి. అలాగే మనిషి మర్మం లేకుండా ఉండాలి. పోలీసాఫీసరు అయినాసరే...మర్మాలులేని వ్యక్తి సీతారాంరావు. అద్దంలాంటిమనిషి. సరదాగా పలకరించి చూడండి.
ఆయనలోనే కాదు, ఆయన రచనల్లో కూడా మీరు ప్రతిబింబిస్తారు. పాఠకునికి ప్రతిపుస్తకమూ ఓ జీవితమే! ఎన్ని పుస్తకాలు చదివితే అన్ని జీవితాల్ని చవిచూసినట్టు. ఈ రెండునవలలూ రెండు జీవితాలు. ఈ రెండు జీవితాలూ ఎంతసేపు? గంటలో అనుభవిస్తాం. కాని నిండునూరేళ్ళూ గుండెల్లో గుర్తుండిపోతాయి. పుస్తకాలు పుష్పిస్తాయి. పుస్తకాలు వర్షిస్తాయి. పుస్తకాలు రగిలిస్తాయి. పుస్తకాలు చలిపెడతాయి. పుస్తకాలు దేన్నయినా సాధిస్తాయి. కావాలంటే చదివిచూడండి! మీకే తెలుస్తుంది.
- జగన్నాథశర