Book Description
అమెరికాలో ఆ ఆరునెలలు! ఒంటరితనంలో ఒ•టరితనం! ఆ ఏకత్వ తత్వంలో వెనక్కి చూస్తే అరవయ్యేళ్ళ వయస్సు వెనపకనుంచి వెక్కిరిస్తున్నది. శేష జీవితంలో జన్మకు అర్థం కల్పించే గుర్తులు మిగిల్చాలి అనే తప కాలం విలువను రెండింతలు చేసింది. అదొక తీయటి వేడి! ఆ వేడిలో పుట్టినవే ఈ కార్టూన్లు, వ్యాఖ్యారహితాలు! బతుకు నడక, వేగంతో పోటీపడుతున్న ఈ రోజుల్లో, కొద్దిగా ఆగండి, కొద్దిగా ఆలోచించండి అనే పటిపెట్టడం సాహసమే, అయినా ఆ పక్రియలో రాంపా ప్రయత్నం చేయకపోతే ఎలా, నా మనసులో ఏదో అనుకుని, ఏవో గీతలు గీసి, ఆ గీతల్లో నేనే ఏదో చూసుకుని అందరినీ అదే చూడండని చెప్పినా, ఆరాటపడ్డా అది అవివేకమే! అని తెలుసుకాబట్టి ఆ జాగ్రత్త ప్రతిక్షణం వుంది.