Book Description
ఆ కాలంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడి వంటివారు దుర్జనులే అయినా వారు కొన్ని నియమాలు, నిబంధనలను గౌరవించారు. కానీ ఇప్పటి దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలకు అలాంటి సంస్కారం లేదు. కాబట్టి భావితరాలవారికి మన పురాణపాత్రల గురించిన విజ్ఞానం సజీవంగా, సక్రమంగా అందాలంటే మనమంతా నడుం కట్టాల్సిన తరుణం ఇదే. ఆనాటి దుష్టచతుష్టయం నుండి ద్రౌపదిని రక్షించటానికి కృష్ణుడొకడ్కడు సరిపోయాడు. కానీ ఈనాటి దుష్టచతుష్టయం నుంచి ద్రౌపదిని కాపాడాలంటే ప్రజలందరు కృష్ణులై ఉద్యమించాల్సి ఉంటుంది. అప్పుడు కానీ భావితరాలకు ద్రౌపది ఔన్నత్యం అర్థం కాదు. అలాంటి ప్రయత్నానికి ‘సౌశీల్యద్రౌపది’ నాందీ ప్రస్తావన.