Book Description
1969 మే నెల ఎండాకాలం. ఉధృతంగా మండుతున్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమం. అర్థరాత్రి పన్నెండు గంటలు దాటింది. అది పాత నగరంలోని శాలిబండా అయినా కావొచ్చు. లేదా నయాపూల్ ప్రక్కన గౌలీగూడ చమన్ అయినా కావొచ్చు. లేదా నారాయణగూడాలోని విఠల్‍వాడీ అయినా కావొచ్చు. చివరికి లష్కర్‍లోని అంజలీ టాకీసు చౌరస్తా అయినా కావొచ్చు. ప్రత్యేక తెలంగాణ సభలు ఇంకా ఆ సమయంలో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా జరుగుతూనే వున్నాయి. ప్రజలందరూ ఓపికగా ఒకే ఒక వక్త కోసం ఎదిరిస్తున్నారు. మాటల మాంత్రికుడతను. మాటల్ని, మంటలుగా మార్చి, ఆ మంటల్ని ఈటెలుగా మార్చి ఆ ఈటెల్ని ఆంధ్ర వలస పాలకుల గుండెల్లోకి సూటిగా గురిచూసి విసిరే నేర్పుగల తెలంగాణా వీరుడతను. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలతో అనర్గళంగా ఉపన్యసించి శ్రోతల్ని ఉత్తేజపరచి ఆవేశంతో ఉర్రూతలూగించి ప్రేరిణీ శివతాండవం చేయించే అద్భుత ఉపన్యాసకుడు అతను. ఇంతకీ ఎవరా మాటల ఈటెల మంటల మాంత్రికుడు?