Book Description
ఒక ఇంగ్లీషు మత ప్రచారకుడు హిందూమతాన్ని, హిందూసంఘాన్ని దుయ్యబడుతూ పత్రికలలో వ్యాసం ప్రకటించగా, ఆ వ్యాసం చదివి గోరా మండిపడ్డాడు. స్వపక్షమునే సమర్థిస్తూ గ్రంథం పూర్తిచేశాడు. ఆ గ్రంథంలో ‘‘మనదేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారం విచారించడానికి మనం నిరాకరించాలి. కీర్తి అపకీర్తుల విషయంలో మన భావాలు అడుగడుక్కూ విదేశీ కొలబద్దతో కొలిచే విధానంమీద ఆధారపడి వుండగూడదు. మన మాతృభూమి విషయంలో సంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాల విషయంలో ఇతర్లకుగాని మనకు మనంగాని క్షమాపణ చెప్పుకునే దుస్థితికి దిగజారకూడదు’’ గోరా మనసు ఇటువంటి భావాలతో నిండిపోయింది. ఇంతటి ఉన్నతమైన అభిప్రాయాలను ఏర్పరచుకుని సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా పాటిస్తూ అటు విదేశీయులని, ఇటు బ్రహ్మ సామాజికులని అసహ్యించుకొనే గోరా తన అభిప్రాయాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది?