Book Description
కలకత్తా సమీపగ్రామంలో ఒక పేదకాయస్థుడు భగవంతుడు తనకు రూపగుణ లావణ్యములుగల యిద్దరు కుమార్తెల నిచ్చాడని, వాళ్ళిద్దరూ వినయగుణ సంపన్నులనీ, వాళ్ళిద్దరూ భగవంతుడు తనకు ప్రసాదించిన అమూల్య సంపద అని అతడు గొప్పలు చెప్పుకుంటూ వుండేవాడు. అదృష్టదేవత సహజంగా యిలాంటి కోమల హృదయము, అతి సున్నితమైన మనస్సుగల అత్యంత సౌందర్యవతులగు హిందూ బాలికలకు చెడ్డభర్తలనే సమకూరుస్తూ వుంటుంది. ఆ కాయస్థుని పెద్దకుమార్తె మాతంగిని చాలా సహృదయురాలు, అత్యంత లావణ్యవతి. ఈ అదృష్టదేవత అనాగరికుడు రాజమోహనునికి ఆమెను భార్యగా చేసింది. వివాహము జరిగిన తరువాత కూడా మాతంగిని తండ్రికి తన కుమార్తెకు తగిన భర్త లభించాడనే విశ్వాసం వుండేది. పెద్దకుమార్తెకంటె రెండో కుమార్తె హేమాంగిని అదృష్టవంతురాలు. ఆమెను మాధవునకిచ్చి వివాహం చేశారు. ఇక చదవండి.