Book Description
ప్రొద్దు వాలిపోతున్నది. కాళ్ళు ముందుకు కదలదలచుకోవడం లేదు. ఇంకా నాలుగు అడుగులేస్తే కాళ్ళు అసలు కదిలేటట్లుగా కన్పించడంలేదు. అందుకే జీవితం పరిసమాప్తమయ్యే శాశ్వతమైన విశ్రాంతి పొందడంకోసం, ఆఖరు మజిలీకి చేరుకోగలడానికి నిరంతరం ముందుకు సాగుతున్నాయి. మిగిలివున్న ప్రాణాల్నీ, మిగిలివున్న శక్తినీ పూర్తిగా ఖర్చుచేసి అంతిమంగా విశ్రమించే స్థలాన్ని అవశ్యం పొందదలచుకున్నాయి. మళ్ళీ తిరిగి ఎన్నడూ లేవకుండా వుండడంకోసం. నదిలోని ఆ మలుపులో ఒక పడవ గుబురుగా పెరిగిన గడ్డి పొదలను ప్రక్కకు తోసుకుంటూ దారి చేసుకొని వస్తున్నది. సురేంద్రనాథ్ బిగ్గరగా అరిచాడు... ‘‘బడదీదీ!’’ కాని శుష్కించిన కంఠం నుంచి శబ్దాలకు బదులు రక్తమే పడి వూరుకుంది. ‘‘బడదీదీ!’’ మరో రెండురక్తపు బొట్లు. ‘‘బడదీదీ!’’ మళ్ళీ మమతలేని రెండు రక్తపు బిందువులు. నదిలోవున్న ఆ గడ్డిపొదలు పడవ నడకను మందగింపజేశాయి. సురేంద్రనాథ్ దగ్గరగా చేరుకుంటున్నాడు. ఆయన మళ్ళీ పిలిచాడు ‘‘బడదీదీ!’’ ఎవరీ బడదీదీ? తప్పక చదవండి శరత్ అద్భుత రచన.