Book Description
శైలేశ్వర్ కలకత్తాలో ఒక ప్రసిద్ధి చెందిన కాలేజీలో తత్వశాస్త్రం బోధించే అధ్యాపకుడు. ఆయన తత్వశాస్త్రంలో ఒక విదేశీ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పుచ్చుకున్నాడు. ఆయన జీతం నెలకు ఎనిమిది వందల రూపాయలు. ఆయన వయసు ముప్ఫె రెండు సంవత్సరాలు. అయిదు మాసాల క్రితం తొమ్మిది సంవత్సరాల వయసుగల కొడుకును తల్లిలేని పిల్లవాణ్ణి చేసి ఆయన భార్య ఈ ప్రపంచంనుండి శాశ్వతంగా వీడ్కోలందుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో ఆ తల్లిలేని పిల్లవాడు తప్ప మిగిలిన వాళ్ళు బేరరు, వంటవాడు, గుర్రాన్ని కాసేవాడు, గుర్రబ్బండి తోలేవాడు మొదలైనవాళ్ళు మొత్తం కలుపుకొని ఏడెనిమిది మంది నౌకర్లు ఉన్నారు. ఓ విధంగా ఈ నౌకర్లూ, చాకర్లే ఆ ఇంట్లో ఉండే జనాభా. శైలేశ్వర్ బాబుకు మొదట పెళ్లి చేసుకోవాలనే కోరిక లేదు. అలా వుండటం సహజమే. తరువాత ఆ కోరిక కలిగింది. ఆధునిక యుగంలో విద్యాధికుడయిన ఒక వ్యక్తికి ఇది ప్రత్యేకంగా కుతూహలం కలిగించేటంత విచిత్రమైన విషయమేమీ కాదు. అయినప్పటికీ ఆ రోజు శైలేష్ డ్రాయింగ్ రూంలో ఈ విషయం మీద సంభాషణ ప్రారంభమైంది. ఇక చదవండి.