Book Description
సీత పదహారేళ్ళ వయసులో కోరికనే ప్రేమ అని భ్రమపడి అది పొందడానికి అడ్డదారిలోపడి సెక్స్ అంటే దడపుట్టి మత్తుమందుల్ని కోరుకుంది. భర్త గొప్ప డాక్టర్ గనుక ప్రేమకు విఘాతం కలగలేదుకాని దూరమయింది - అరచేతిలో రేఖల ప్రకారం డాక్టర్ భర్త కూడా బతికించలేని విధంగా విధి ఆమెను కాల్చేసింది. ఆమె మరో జన్మలో తన కూతురు కడుపున పుట్టింది. జ్యోతిర్వేత్త, మహావైద్యుడు, ఒకే జీవితంలో రెండు శరీరాల్ని ఆశ్రయించినాడు అయిన తన భర్త డాక్టర్ వనమాలిని మరోజన్మ యెత్తికూడ గుర్తుపట్టింది. ఈ విషయాలన్నింటికి హేతువులు, కల్ననలూ యిస్తూ యివి అసంభవం కాదని భారత రామాయణాల సాక్ష్యాలతో సాగే అత్యంత రసవత్తర నవల..