Book Description
కట్నం వంటి దురాచారాలంటే పడదు దేవకికి. ఆమెకు కొన్ని ఆదర్శాలున్నాయి. ఆ ఆదర్శాల ప్రకారం జీవించాలన్న కోరిక ఉంది. ప్రయత్నమూ చేసింది. అయితే… ”వివాహాత్పూర్వం ఊహించే స్వర్గధామం వేరు, వివాహానంతరం అనుభవాలు చెప్పే అర్థాలు వేరు. అక్కడ వ్యక్తిత్వాలు నిలవవు. ఆదర్శాలకు ఆస్కారం వుండదు. సంసార తాపత్రయంలో ఎటువంటివారైనా సామాన్యులే అయిపోతారు.” అవునా… ఇప్పుడు దేవకి ఏమనుకుంటూంది? ”కట్నం అనేది వ్యక్తి గౌరవాన్ని పెంచుతుందన్నమాట. నేనే కట్నం తెచ్చుకొనివుంటే ఈనాడు వీళ్ళింత నీచంగా విదిలించగలిగేవాళ్ళేనా? పెళ్ళయి రాగానే పుట్టిల్లు పరాయిదైపోతుంది. ఇక వాళ్ళను ‘ఇది కావాలి అది కావాలి’ అని అడిగే స్వతంత్రం పోతుంది. ఈనాడు పైసా పైసాకు భర్తపై ఆధారపడవలసి వచ్చింది” ఇలా ఎలా జరిగింది? తెలుసుకోవాలంటే ఆరికెపూడి కౌసల్యాదేవి దివ్యదీపావళి చదవండి.