Book Description
ఇది కేవలం ముఖ్యమంత్రుల పరిచయ పుస్తకం తప్ప వారి పనితీరు, రాజకీయాలకు సంబంధించిన విమర్శనా గ్రంథం కాదు. ఈ పుస్తకంలో ముఖ్యమంత్రులు పరిచయం చేస్తూ వారి జీవితంలోని సంఘటనలు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలు, రాజకీయ నేపధ్యాన్ని స్ప•శించటం జరిగింది. మన ముఖ్యమంత్రులందరి గురించి సంక్షిప్తంగానైనా పరిచయం చేస్తూ ఒక్కపుస్తకం కూడా ఇంతవరకు రాలేదు. ముఖ్యమంత్రులను గూర్చిన సమాచారం కూడా సులభంగా లభ్యమవటంలేదు. ఇంటర్నెట్ వార్తాపత్రికలపై ఆధారపడి సమాచారం సేకరించాల్సి వచ్చింది. మన ఆంధ్రరాష్ట్రం 1956లో ఏర్పడినా పొట్టిశ్రీరాములు త్యాగఫలితంగా 1953 నుండే ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు ఏర్పడినాయి. కాబట్టి ముఖ్యమంత్రు జాబితాలో 1953 నుండి 56 వరకూ ముఖ్యమంత్రులుగా ఉన్న టంగుటూరి, బెజవాడ గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణయ్యగార్లను కూడా చేర్చటం జరిగింది.