Book Description
‘‘ఆఁ ప్రతి ఒక్కటీ వరూధిని చెప్పినట్లే చేశాను. నీ డ్రెస్ నీవు కాలేజీకి వెళాళక, బాలరాజు తెచ్చి ఇచ్చాడు. దానితోపాటు ఒక ఉత్తరం కూడా. అది నాకు అడ్రస్ చేసి వుండటంతో విప్పాను. నిన్ను ఎలా అలంకరించాలో వరూధిని వ్రాసింది. గౌను ఈ మోడల్లో కుట్టిందట. బ్రిటిష్ రాణుల ఎత్తులు, నడుం సన్నదనం కనుపించే వారి గౌనును మోడల్గా తీసుకుందట. తన శ్రమ ఫలిస్తుందని ఆశిస్తూ దీవించింది. దివ్యా! అలాటి స్నేహమయి దొరకడం, నీ అదృష్టం.’’ వరూధిని, దివ్యాల స్నేహం అపురూపమైనది. ఆ స్నేహం దివ్యా అన్న విక్రమ్ కి కంటగింపు అయింది. విక్రమ్ వలన వారి స్నేహం చెదిరిందా? ఇంకా ఎక్కువగా ముడిపడిందా? తెలుసుకోవాలంటే చిట్టారెడ్డి ‘‘ప్రేమపూజారి’’ చదవాల్సిందే.