Book Description
ఒక గూడు! అందులో ఒక మగ, ఒక ఆడ, ఆ రెంటికి కలిగిన చిన్నారి పిల్లలు. పిల్లలు పుట్టాక ఆ పిల్లలే జీవితం ఆ రెంటికి. అంటే ఏమిటి? రక్త సంబంధం ఈ ప్రపంచంలో మనిషికే కాదు పక్షికీ, పశువుకీ కూడా మమతాపాశం అవుతుంది. మరో జీవి కనిపిస్తే మీదపడి చీల్చి చెండాడే పులిలాంటి క్రూరజంతువు సైతం తన పిల్లలమీద ఈగను కూడా వాలనివ్వదు. ప్రేమతో సాకుతుంది. ఈ మమతాపాశమే ఒక గూటికి కట్టి వేస్తుంది. తన ఇల్లు, తన భార్య, తన పిల్లలు. ఈ వలయంలో బందీకాని మనిషి అరుదు.